ఎక్స్ ప్రెస్ హరిపై బాడీ షేమింగ్ డైలాగ్స్ వేసిన దీపికా పిల్లి!
on Dec 3, 2022
ఎక్స్ ప్రెస్ హరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..బుల్లితెర అన్ని రకాల కామెడీ షోస్ లో హరి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. పటాస్ షోలో యాదమ్మ రాజుతో కలిసి జోడీగా స్కిట్స్ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటాడు.
ఇక ఇప్పుడు కామెడీ స్టాక్ ఎక్స్చేంజి కామెడీ షోకి ఫోర్త్ స్టాక్ గా స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చాడు. టెంపర్ మూవీలో సాంగ్ తో హడావిడి చేసి డాన్స్ వేసాడు..ఫ్లోర్ స్టెప్స్ కూడా వేసి ఎంటర్టైన్ చేసాడు. "2 జి, 3 జి, 4 జి, 5 జి ఎన్ని "జి"లు మారినా తగ్గదు మా స్టూడెంట్స్ ఎనర్జీ" అని అద్దిరిపోయే డైలాగ్ వేసాడు. "అవినాష్, యాదమ్మ రాజు వచ్చి నాకు బిస్కెట్ వేస్తే హరి మాత్రం డైరెక్ట్ గా ఆడియన్స్ కి బిస్కెట్ వేసేశాడు" అని పంచ్ పేల్చాడు అనిల్ రావిపూడి. దాంతో "దేవుడు ఉండేది గుడి, మా ముందున్నది అనిల్ రావిపూడి" అని చెప్పి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నాడు హరి.
ఇక ఇతని స్టాక్ చార్ట్ చూస్తే "ఆత్రం 60 శాతం, టెన్షన్, పంచులు, డాన్స్ కలిసి 40 శాతం" అని చూపించింది. డాన్స్ కి 5 శాతం మాత్రమే మార్క్స్ పడేసరికి "డాన్స్ కి ఇన్ని తక్కువ మార్క్స్ ఏమిటి..ఆ రేంజ్ లో డాన్స్ చేస్తే నా బాడీలో రిథమ్ కనిపించలేదా" అన్నాడు హరి .."నీ బాడీలో దమ్ము లేదు ఇంకా రిధం ఎక్కడ కనిపిస్తది" అని పంచ్ వేసింది దీపికా పిల్లి. "అంటే నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నావా" అన్నాడు హరి. "అసలు నీకు బాడీ ఉందా బాడీ షేమింగ్ చేయడానికి" అని రివర్స్ కౌంటర్ వేసింది.
Also Read